ప్ర‌త్యేక ఐసోలేష‌న్ వార్డులుగా ట్రైన్ బోగీలు

ప్ర‌త్యేక ఐసోలేష‌న్ వార్డులుగా ట్రైన్ బోగీలు

ఇండియాలో ఊహించని విధంగా రోజు రోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపధ్యంలో రోగులకు సత్వర వైద్య చికిత్స అందించేందుకు ఐసోలేషన్ వార్డుల అవసరం చాలా ఉంది. దీంతో ప్రయాణాలకు వినియోగించే ప్యాసింజర్ రైళ్ల బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు. క‌రోనా ల‌క్ష‌ణాలున్న వారి కోసం, క‌రోనా పాజిటివ్ నిర్దార‌ణ అయిన వారి కోసం గుజరాత్ లోని వెస్ట్ రైల్వే జోన్ లో రైళ్ల‌లో బోగీల‌ను ప్ర‌త్యేక ఐసోలేష‌న్ కోచ్ లుగా మార్చారు. కంక‌రియా కోచింగ్ డిపోలో క‌రోనా బాధితుల కోసం మెడిక‌ల్ స్టాఫ్ తోపాటు ప్ర‌త్యేకంగా బెడ్ లు సిద్దం చేశారు. అయితే శ‌నివారం ఒక్కరోజే గుజ‌రాత్ లో 10 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 105కు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story