గోడ పగలగొట్టి మద్యం దొంగతనం

రూమ్ గోడలు పగలగొట్టి దుండగులు మద్యం దొంగతనం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల ఓ వైన్స్‌ షాపులో దుండగులు మద్యం దొంగతనానికి పాల్పడ్డారు. దుకాణం వెనుక నుంచి రంద్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ. లక్ష విలువైన మద్యం బాటిళ్లను అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Recommended For You