23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 23 రోజుల వయసున్న బిడ్డకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ కావడం కలకలం సృష్టిస్తోంది. 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని జిల్లా కలెక్టర్‌ వెంకట్రావ్‌ తెలిపారు. శిశువు తండ్రి మార్చి 23న మర్కజ్‌ నుంచి ఇంటికి వచ్చారు. అప్పట్నుంచి కరోనా లక్షణాలతో బాధ పడుతుండటంతో వైద్యులు ఆయన్ను మార్చి 28న గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్‌ 2న అతడికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో అధికారులు వెంటనే ఆయన భార్యతోపాటు 23 రోజుల శిశువును క్వారంటైన్‌లో ఉంచారు. మూడు రోజుల తర్వాత శిశువుకు దగ్గు రావడంతో వెంటనే వైద్యులు నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని నిర్ధారణ కేంద్రానికి పంపారు. ఆ పరీక్షల్లో పసికందుకు పాజిటివ్‌ రాగా, తల్లికి నెగిటివ్‌ వచ్చింది.

అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మరోవైపు కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ అన్ని చర్యలు తీసుకుటోంది.

Recommended For You