వలస కార్మికుల రైల్వే ప్రయాణానికి అయ్యే ఖర్చు కాంగ్రెస్ భరిస్తుంది: సోనియా

వలస కార్మికుల రైల్వే ప్రయాణానికి అయ్యే ఖర్చు కాంగ్రెస్ భరిస్తుంది: సోనియా

వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల ప్రయాణానికి అయ్యే ఖర్చులను కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ కమిటీలే భరిస్తాయని ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ప్రకటించారు. ఏ రాష్ట్రానికి సంబందించిన వలస కూలీలు, కార్మికులకు అవసరమయ్యే ఖర్చులను ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు భరిస్తుందని తెలిపారు.

వలస కార్మికుల కష్టాలపై ప్రభుత్వ వైఖరిని ఆమె తప్పు పట్టారు. వలస కార్మికులే దేశానికి వెన్నెముక అని.. దేశ ఆర్థిక అభివృద్ధిలో వారిది కీలక పాత్ర అని అన్నారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తూ.. నాలుగు గంటలు మాత్రమే సమయాన్ని ఇచ్చి కేంద్రం లాక్‌డౌన్ విధించిందని.. ఈ నాలుగు గంటల సమయంలో వలస కార్మికుడు చేసేది ఏమి లేని పరిస్థితి అని అన్నారు. స్వాతంత్ర్యానంతరం ఇప్పటివరకు వలస కార్మికులకు ఇలాంటి దుస్థితి ఎప్పుడు ఏర్పడలేదని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని ప్రత్యేక విమానాలతో తీసుకొని వచ్చారు.. కానీ, వలస కార్మికులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని ఆమె ప్రశ్నించారు. గుజరాత్ లో ట్రంప్ హాజరైన ఒక కార్యక్రమానికి 100 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం వలస కార్మికులను పట్టించుకోలేదని అన్నారు. పీఎం-కేర్స్‌ ఫండ్‌కు రూ.151 కోట్ల నిధుల్ని విరాళంగా ఇచ్చిన రైల్వే శాఖ వలస కార్మికులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించలేదా అని ప్రశ్నించారు. తోటి పౌరులైన వలస కార్మికుల సేవలను గౌరవిస్తూ.. వారి కష్టాన్ని గుర్తిస్తూ.. వారికి సహకారం అందించాలని కాంగ్రెస్ నిర్ణయించిందని.. వారితో భుజం భుజం కలిపి నిలబడతామని సోనియా గాంధీ తెలిపారు.cong

Tags

Read MoreRead Less
Next Story