వందేభారత్ మిషన్ రెండో దశ షెడ్యూల్ విడుదల

వందేభారత్ మిషన్ రెండో దశ షెడ్యూల్ విడుదల

వందేభారత్ మిషన్ రెండో దశ షెడ్యూల్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకోని వచ్చేందుకు రెండో దశలో భాగంగా మే 16 నుంచి మే 22 వరకూ 149 విమానాలు నడపనున్నట్టు తెలిపింది. మొత్తం 31 దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చనున్నారు. ఎయిర్ ఇండియా రెగ్యులర్ ఫ్లైట్స్ లేని కొన్ని దేశాలైన ఉక్రెయిన్, అర్మేనియా, కిర్జిస్తాన్, బెలారస్, జార్జియా, కజకస్తాన్, తజికిస్తాన్, నైజీరియా నుంచి కూడా భారతీయులను ఈ ప్రత్యేక విమానాల్లో తరలించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అమెరికా, యూఏఈ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్, సింగపూర్, రష్యా దేశాలలో చిక్కుకున్న భారతీయులను కూడా ఈ దఫాలో భారత్‌కు చేర్చనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే వందే భారత్ మిషన్ తొలి దఫాలో భాగంగా 31 విమానాల్లో 6,037 మంది భారతీయులను స్వదేశానికి తరలించిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story