సెల్‌తో కరోనా వ్యాపించే ప్రమాదం

సెల్‌తో కరోనా వ్యాపించే ప్రమాదం

మన చేతిలో సెల్ ఫోన్ ఎంత సేఫ్. దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కరోనా వైరస్ రాకుండా చేతులు కడుక్కుంటాం. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటాం. ముఖానికి మాస్కు ధరిస్తాం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సెల్‌ఫోన్ గురించి అస్సలు పట్టించుకోం. సెల్‌ఫోనే చాలా ప్రమాదకరమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కరోనా మొబైల్ ఫోన్ ద్వారా కూడా వేగంగా వ్యాపించే ముప్పుందట. పొరపాటున వైరస్ మొబైల్‌పై పడితే అది మనం మాట్లాడేటప్పుడు ఏదో ఒక రకంగా శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అందుకే మొబైల్‌ ఫోన్‌ను తరచూ ఐసోప్రోపైల్‌ ఆల్కహాల్‌ కలిగిన శాటిటైజర్‌తోగానీ, క్లోరాక్స్‌ డిస్‌ ఇన్ఫెక్టింగ్‌ వైప్ప్‌తోగానీ శుభ్ర పరచుకోవాలని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story