డాక్టర్ సుధాకర్‌పై దాడికి జగన్ నైతిక బాధ్యత వహించాలి: చంద్రబాబు

డాక్టర్ సుధాకర్‌పై దాడికి జగన్ నైతిక బాధ్యత వహించాలి: చంద్రబాబు

విశాఖలో డాక్టర్ సుధాకర్‌పై దాడిని ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. దళిత వైద్యుడిపై దాడి అమానుషమన్నారు. ఓ వైద్యుడిని చేతులు కట్టేసి లాఠీలతో కొట్టడం హేయమన్నారు. ప్రశ్నించే వ్యక్తులందరిని హింసిస్తారా? అని ప్రశ్నించారు చంద్రబాబు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఈ దురాగతానికి సీఎం జగన్‌దే నైతిక బాధ్యత అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చేశారంటూ మండిపడ్డారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ? లేక ఫాసిస్ట్‌ పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు. ఓ వైద్యుడికి ఈ పరిస్థితి తెచ్చినందుకు సిగ్గుపడాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, ఆయన కాల్‌ లిస్ట్‌ను విశ్లేషించాలన్నారు చంద్రబాబు. డాక్టర్‌ను బెదిరించిన వారిని అరెస్ట్‌ చేయాలన్నారు. నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ‌

Tags

Read MoreRead Less
Next Story