రాహుల్, సోనియాపై నిర్మలా సీతారామన్ మండిపాటు

రాహుల్, సోనియాపై నిర్మలా సీతారామన్ మండిపాటు

ఐదో విడత ప్యాకేజీ వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాహుల్, సోనియా గాంధీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రధాన ప్రతిపక్షం బాధ్యతా యుతంగా వ్యవహరిచాలని హితవుపలికారు. రాజకీయాలు చేయడానికి ఇది సమయంకాదని ఆమె అన్నారు. రోడ్డుపై నడిచి వెళ్తున్న వలస కార్మికులతో రాహుల్ ముఖాముఖి నిర్వహించడమేంటని ఆమె మండిపడ్డారు. వారితో అలా మాట్లాడే కంటే.. వారి పిల్లలనో.. లగేజీనో తీసుకుంటే బాగుండేదని ఆమె సూచించారు. తమవి నాటకాలని రాహుల్ విమర్శిస్తున్నారని.. కానీ, వాళ్లు చేసేవి నాటకాలు కాదా? అని ప్రశ్నించారు. అటు, వలస కార్మికుల విషయంలో అందరం కలిసి పని చేద్దామని అన్నారు. ఇదే నా విన్నపమని అన్నారు. అందరం కలిసి బాధ్యతగా వ్యవహరిద్దామని సోనియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో బాధ్యతగా మాట్లాడాలని.. చేతులు జోడించి సోనియాను వేడుకుంటున్నా అని నిర్మలా సీతారామన్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story