ఆడియో ఫంక్షన్లు.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు.. అన్నిటికీ గుడ్‌బై: శోభు యార్లగడ్డ

కరోనా వచ్చింది.. ఇండస్ట్రీకి కష్టకాలం వచ్చింది. ఇకపై ఆడియో ఫంక్షన్లకు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు కాలం చెల్లిందంటున్నారు ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ. ఇంతకు ముందు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా థియేటర్‌లో రిలీజ్ చేసేవాళ్లం. ఇప్పుడు ఓటీటీని ఆశ్రయించాల్సి వస్తుందని అంటున్నారు. కోవిడ్ 19 తర్వాత చిత్ర పరిశ్రమలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన అంటున్నారు. సినిమాకి సంబంధించిన కార్యక్రమాలను ఇక ముందు పెద్ద ఎత్తున నిర్వహించలేమని అన్నారు. ముందు ముందు డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ సంభాషణలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని శోభు తన అభిప్రాయాలను వెల్లడించారు.

Recommended For You