క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఐపీఎల్

వందలు, వేల మంది సమూహం లేందే ఒక సమావేశం కానీ, ఒక ఆట కానీ ముగియదే. అలాంటిది కరోనా వచ్చి అలాంటివాటన్నింటినీ కట్టడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ ఎలా జరుగుతుంది. కానీ సాధ్యమే అంటున్నారు బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ. వర్షాకాలం తర్వాత అంతర్జాతీయ క్రికెటర్లతో ఐపీఎల్ నిర్వహణ సాధ్యమేనని ఆయన అంటున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడతారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఈ మ్యాచ్ నిర్వహిస్తామని అన్నారు. లాక్డౌన్ అనంతరం వర్షాకాలం వస్తుంది. ఆ తర్వాతే ఐపీఎల్ జరుగుతుంది.
ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ నిర్వహించడం కష్టసాధ్యమైన పనే. భారీ నష్టాన్ని కూడా చవి చూడాల్సి వస్తుంది. అభిమానుల కేరింతలు లేకపోతే ఎంతటి ఆటగాడికైనా మజా రాదు. ఎలా చేస్తే ఐపీఎల్ అభిమానులను ఆకట్టుకుంటుంది అనే విషయాలను చర్చిస్తున్నామని అన్నారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18న ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ఆరంభమవ్వాలి. ఈ మెగా టోర్నీ కూడా వాయిదా పడొచ్చని సమాచారం. మే 28న జరిగే సమావేశంలో ఐసీసీ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com