కరోనా ఎఫెక్ట్: మరోసారి శ్రీలంకలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం

కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు అధికారిక కార్యక్రమాలు వాయిదా వేసుకుంటున్నాయి. శ్రీలంకలో ఏప్రిల్ 25న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు ఈ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. అయితే, కొత్త షేడ్యూల్ ప్రకారం జూన్ 20 నుంచి జరగాల్సిన ఎన్నికలు కూడా మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. జూన్ లో కూడా ఎన్నికలు జరిపించడానికి వీలు పడదని అక్కడి ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు నిర్వహించకపోవడమంటే పౌరుల ప్రాధమిక హక్కులు భంగపరచడమే అని కొందరు నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, ఎలక్షన్ కమిషనర్ తరుపు న్యాయవాది.. ఈ విపత్కర సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాద్యం కాదని చెప్పుకొచ్చారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాయని ఆరోగ్యశాఖ ప్రకటిస్తే.. 10 వారాలు తరువాతే ఎన్నికలు నిర్వాహణ జరుగుతోందని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com