ఇలాంటి అన్యాయం ఎవరికీ జరగకూడదు: డాక్టర్ సుధాకర్ తల్లి

డాక్టర్ సుధాకర్‌ కేసును.. సీబీఐకి అప్పగించడంపై ఆయన తల్లి స్పందించారు. తమకు న్యాయం జరగాలని కోరారు. ఇలాంటి అన్యాయం ఇంకా ఎవరికి జరగకూడదన్నారు ఆమె. ఒక రాయల్‌ ఫ్యామిలీగా బతికిన తమను.. రోడ్డు ఎక్కించారని.. పరువు తీశారని డాక్టర్ సుధాకర్‌ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పోయిన పరువు వస్తాదా అని నిలదీశారు. తమకు న్యాయం జరిగిన తర్వాతే తన ఫ్యామిలీ అంటే ఎంటో చూపిస్తానన్నారు. ఎలాంటి సపోర్ట్‌ లేని దళితులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవదన్నారు ఆమె. నేను కోర్టును, సీబీఐను నమ్ముకున్నాని అన్నారు. నాకు న్యాయం జరిగి.. తన కొడుకు ఉద్యోగం తిరిగి ఇవ్వాలన్నారు కోరారు.

Recommended For You