రైతు పొలంలో కోటి రూపాయల విలువైన వజ్రాలు..

రైతు పొలం దున్నుతుండగా కోటి రూపాయల విలువైన వజ్రాలు బయటపడ్డాయి. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామంలో నాలుగు రోజుల క్రితం ఓ రైతుకు విలువైన వజ్రాలు దొరికాయి. గ్రామ శివారులో ఊటకల్లుకు వెళ్లే దారిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆ భూమి వర్షానికి పదును కావడంతో అందులో రైతు సేద్యం పనులు చేశాడు. భూమిని దున్నుతుండగా వజ్రం కనబడింది. దాన్ని తీసుకుని కర్నూలు జిల్లా పెరవలిలో విక్రయించేందుకు వెళ్లాడు. అక్కడ ధర దగ్గర తేడా వచ్చింది. దాంతో మరో వ్యాపారికి దగ్గర విక్రయించేందుకు వెళ్లాడు. గుత్తి ఆర్ఎస్ వ్యాపారి దాన్ని రూ.30 లక్షలకు కొనుగోలు చేశాడు. అయితే ఆ వజ్రం ధర కోటి రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. మధ్యవర్తులు వజ్రాల వ్యాపారితో కుమ్మక్కై రైతుకు తక్కువ ధర ఇచ్చినట్లు తెలుస్తోంది.

Recommended For You