ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలి.. సీఎం జగన్‌కు.. కన్నా లక్ష్మీనారాయణ లేఖ

డాక్టర్‌ సుధాకర్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. ఈ మేరకు ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. సుధాకర్ విషయంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కుల కోసం నిలదీస్తే సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ప్రశ్నించే వారిపై ఇలాంటి చర్యలకు దిగడం సమజసం కాదన్నారు. సుధాకర్ విషయంలో పోలీసుల వ్యవహారించిన శైలిని హైకోర్టు తప్పుపట్టిన విషయాన్ని గుర్తుచేశారు కన్నా లక్ష్మీనారాయణ. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు.

Recommended For You