మండు వేసవిలో.. పండు వెన్నెల

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా కాబోయే భార్య మిహీకా బజాజ్‌ల రోకా కార్యక్రమం ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో రానా మిహికా చెవిలో ఏదో చెబుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇది నాకు సంతోషాన్నిచ్చేది అంటూ 3 హార్ట్ ఎమోజీలతో పాటు 2 నవ్వుతూ ఉండే ఎమోజీలను జత చేసి షేర్ చేశారు. మిహికా పోస్టుకు హీరో వెంకటేష్ కూతురు అశ్రిత.. చాలా సంతోషంగా ఉంది.. నేను ఆ సంతోష సమయంలో అక్కడ లేనందుకు బాధగా ఉంది. మీ ఇద్దరికి నా శుభాకాంక్షలు అని కామెంట్ చేసింది. రానా, మిహికల ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో మంగళవారం వీరిద్దరి నిశ్చితార్ధం జరిగింది. ఇక వివాహ ముహూర్తాన్ని నిర్ణయించేందుకు బుధవారం రామానాయుడు స్టూడియోలో రోకా కార్యక్రమాన్ని నిర్వహించారు.

Recommended For You