బికినీలో వైద్యం.. కరోనా రోగులకు సేవలందిస్తున్న నర్స్

ఎండలు మండిపోతున్నాయ్. ఒంటి మీద బట్టలే కష్టంగా ఉంటే ఇంకా ఆ పీపీఈ కిట్ ఏం ధరిస్తాం చెప్పండి అంటూ రష్యాకు చెందిన ఓ నర్స్ బికినీ వేసుకుని కరోనా రోగులకు సేవలందిస్తోంది. హాస్పిటల్ యాజమాన్యం కూడా ఆమె డ్రెస్ తీరుకి అభ్యంతరం చెప్పకపోవడంతో వార్డులన్నీ అదే డ్రెస్‌తో తిరిగేస్తోంది. రష్యాలోని టులా నగరానికి చెందిన ఒక హాస్పిటల్‌లో 20 ఏండ్ల యువతి నర్సుగా సేవలు అందిస్తుంది. హాస్పిటల్ యాజమాన్యం పీపీఈ కిట్లను అందించింది.

అందరూ తమ దుస్తులపై ఈ కిట్ ధరించినా.. ఆ నర్స్ మాత్రం లో దుస్తులపై పీపీఈ కిట్ ధరించింది. ఆమె వేషధారణ చూసి షాకైన ఓ పేషెంట్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. నర్స్ డ్రెస్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్స్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిందని దేశ ఆరోగ్య శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై క్రమశిక్షణా రాహిత్యం క్రింద కేసు నమోదు చేసింది.

Recommended For You