చైనాపై సంచలన ఆరోపణలు చేసిన ట్రంప్

X
By - TV5 Telugu |22 May 2020 2:28 PM IST
చైనాపై అమెరికా అధినేత ట్రంప్ మళ్లీ మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై చైనా దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌ను గెలిపించడానికి చైనా ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. చైనా వల్లే ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఘాటుగా విమర్శించారు. చైనా వైఖరిని ఖండిస్తూ ఓ రిపోర్ట్‌ను కూడా విడుదల చేసిన వైట్ హౌజ్, చైనా ఆర్థిక విధానాలు, సైనిక చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com