మహారాష్ట్రలో ఒక్కరోజే 63 మరణాలు.. రికార్డు స్థాయిలో కొత్త కేసులు

మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గటం లేదు. గడిచిన 24 గంటల్లో 2940 కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసులు సంఖ్య 44,582కు చేరింది. ఈరోజు ఒక్కరోజే 63 మంది కరోనాతో చనిపోగా.. మొత్తం కరోనా మృతుల సంఖ్య 1517 కు చేరిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం 857 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటి వరకూ మొత్తం 12,583 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా కేసులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ పోతున్నాయి.

Recommended For You