మన అలవాట్లే మనకు శ్రీరామ రక్ష.. అందుకే కరోనా వైరస్..

కరోనా కాదు కదా మరే వైరస్సూ మనల్ని ఏమీ చేయలేదంటున్నారు అమెరికాలో నివసిస్తున్న భారతీయ వైరాలజిస్టులు. 6నెలల క్రితమే కరోనా వైరస్ వెలుగు చూసినా వ్యాప్తి విస్తృతంగా ఉండడంతో నివారణ కష్టంగా మారిందని అంటున్నారు. అదీకాక ఇది చిన్న స్పర్శకే వ్యాపిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే 80 శాతం వరకు వైరస్ బారిన పడకుండా చూసుకోవచ్చు. 15 శాతం మందిలో నోరు, ముక్కు ద్వారా నోటిలోకి ప్రవేశిస్తుంది. 5 శాతం మందిలో ప్రమాదకరంగా మారుతుంది. వీరిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండడమే ఇందుకు కారణం.

కరోనా వైరస్ ఊపిరితిత్తుల అడుగుభాగానికి చేరి వాటి రక్షణకు విడుదలయ్యే సబ్బు లాంటి పదార్ధాన్ని విడుదలవకుండా అడ్డుకుంటుంది. దాంతో ఊపిరితిత్తుల్లో ద్రవాలు పెరిగిపోయి, శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. ఇక భారతీయులకు ఉన్న ఓ మంచి అలవాటు భోజనానికి ముందు, తరువాత చేతులు శుభ్రంగా కడుక్కుంటారు. ఆహారంలో పసుపు, వెల్లుల్లి వంటి యాంటీ వైరల్ పదార్థాలు వాడతారు. మజ్జిగ, పెరుగు జీర్ణకోశంలో ప్రో బయాటిక్స్‌ను తయారు చేస్తాయి. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి ఇవి తోడ్పడతాయి.

అమెరికన్స్‌లో ఉన్న అతి శుభ్రతే వారిని వైరస్ బారిన పడేలా చేసింది. ఆహారం విషయంలో కూడా.. వారు తీసుకునే ఆహారంలో 10 నుంచి 100 లోపు బ్యాక్టీరియా ఉంటుంది. అదే ఇండియాలో అయితే లక్షలు, మిలియన్లలో ఉంటాయి. ఆహారంలో బ్యాక్టీరియా లేకపోతే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్త శత్రువుని ఎదుర్కునే స్థాయిలో ఉండదు. అగ్ర దేశాలతో పోలిస్తే భారత్‌‌లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉండడానికి కారణం.. చిన్నప్పటి నుంచి భారతీయుల పిల్లలు మట్టిలో ఆడుతుంటారు.

ఆ సమయంలోనే బ్యాక్టీరియా దాడికి గురవుతుంటారు. పిల్లలు ఎదిగి 13 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి వారిపై ఆరు కోట్ల బ్యాక్టీరియా, వైరస్‌లు దాడి చేస్తాయి. దీంతో సహజంగానే శరీరం యాంటీ బాడీస్‌ని తయారు చేసుకుంటుంది. ఏదైనా వైరస్ దాడి చేసినప్పుడు.. క్షణంలోనే యాంటీబాడీలు స్పందించి వైరస్‌ను అడ్డుకుంటాయి. మన అలవాట్లను మనం చిన్న చూపు చూస్తాం కానీ అవే మనల్ని కాపాడుతున్నాయని అర్థం చేసుకుని ఆచరిస్తే మంచిదని అంటున్నారు అమెరికాలో స్థిరపడిన భారతీయ వైద్యులు.

Recommended For You