భలే దొంగ.. ఏకంగా బస్సునే ఎత్తుకుపోయాడు..

బస్సుకు సంబంధించిన టైర్లో, వీల్సో, మరేదో దొంగతనం చేయాలంటే బోల్డంత తతంగం. బోల్టులు విప్పాలి.. రెంచీలు తిప్పాలి. ఆ సౌండ్‌కి ఈలోపు ఎవడన్నా వస్తే పడిన కష్టమంతా వృధా. ఎలాగూ డ్రైవింగ్ వచ్చు. బస్సే పట్టుకెళ్లి పోతే ఎంచక్కా అందర్నీ ఎక్కించుకుని ఊరంతా ఏం ఖర్మ ఊరు కూడా దాటించేయొచ్చని ఎంత అమాయకంగా ఆలోచించాడు.. అస్సలు తెలివి లేని ఆ దొంగ. అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపో నుంచి బస్సును ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించినట్లు తెలుసుకున్నారు ఆర్టీసీ అధికారులు. వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది చెక్ పోస్టుల వద్ద కాపు కాశారు. సికేపల్లి పోలీసులు అతడిని కియా పరిశ్రమ వద్ద పట్టుకుని అరెస్ట్ చేశారు. బస్సు దొంగిలించిన వ్యక్తి కర్ణాటక వాసి అని పోలీస్ ఎంక్వైరీలో తెలిసింది.

Recommended For You