ఆదుకోండి లేదంటే అవకాశమైనా ఇప్పించండి.. కష్టాల్లో 'ఇంద్రుడు'

ఆదుకోండి లేదంటే అవకాశమైనా ఇప్పించండి.. కష్టాల్లో ఇంద్రుడు

మహాభారతంలో ఇంద్రుడిగా రాజభోగాలు అనుభవించారు. దాదాపు 300 హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించి నటుడిగా ఓ వెలుగు వెలిగారు సీనియర్ నటుడు సతీష్ కౌశల్. మహాభారతం ధారావాహికలో ఇంద్రుడిగా మెప్పిం చిన కౌశల్ ఇప్పుడు మంచానికే పరిమితమై అద్దె ఇంట్లో జీవితం వెళ్లదీస్తున్నారు. 73 ఏళ్ల వయస్సులో సాయం కోసం బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. బండ్లు ఓడలవడం.. ఓడలు బండ్లవడం అంటే ఇదేనేమో.. ఈ సామెత సినీ ఇండస్ట్రీకి సరిగ్గా సరిపోతుందనుకుంటా. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటీనటుల పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంటుంది.

దయగల మహానుభావులెవరైనా సినిమాల్లో అవకాశాలైనా ఇప్పించండి లేదంటే ఆర్థికంగా అయినా ఆదుకోండి అంటూ వినమ్రంగా వేడుకుంటున్నారు. నటించే సత్తా తనకింకా ఉందని అన్నారు. ఇంతకు ముందు వృద్ధాశ్రమంలో ఉన్నానని, ప్రస్తుతం ఓ అద్దె ఇంటిలో నివసిస్తున్నానని పేర్కొన్నారు. లాక్డౌన్ వల్ల పరిస్థితులు కష్టంగా మారాయని అన్నారు. కనీసం నిత్యావసరాలతో పాటు, మందులు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పారు. ఒక నటుడిగా నన్ను ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు అవసరం కోసం అర్థిస్తున్నాను.. ఆదుకుంటారని ఆశిస్తున్నాను అని దీనంగా వేడుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story