నా కొడుకు నన్ను మించి పోయేలా ఉన్నాడు..

నా కొడుకు నా అంత వాడవుతున్నాడు.. తండ్రిగా నాకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది అని తన హైట్‌తో పోటీపడుతున్న గౌతమ్‌ని చూసి సంతోషిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. లాక్డౌన్ సమయాన్ని ఇంట్లో భార్యా పిల్లలతో గడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు సెలబ్రెటీలు. సితార, గౌతమ్‌లతో సందడి చేస్తున్న మహేష్ ఓ రోజు హైటెక్ చెక్ చేసుకున్నట్టున్నారు. అదే విషయాన్ని ఇన్‌స్టాలో షేర్ చేశారు. హైట్ చెక్!! హి ఈజ్ టాల్, లాక్‌డౌన్‌లో కొంచెం ఫన్నీగా అని రాసుకొచ్చారు మహేష్. ఈ వీడియోని చూసిన మహేష్ ఫ్యాన్స్.. సూపర్ స్టార్ హైట్‌కి ఏమాత్రం తీసిపోలేదుగా అని కాంప్లిమెంట్ ఇస్తున్నారు తండ్రీ కొడుకులకి.


View this post on Instagram

 

Height check!! He’s tall♥️♥️ #LockdownShenanigans

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

 

Recommended For You