వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కేసీఆర్ లక్ష్యం: హరీష్ రావు

వ్యవసాయ సాగు లాభసాటిగా మార్చడమే ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యమని మంత్రి హరీష్ రావు అన్నారు. కోటి 80లక్షల ఎకరాలకు రైతు బంధు ద్వారా 14వేల కోట్లను రైతులకు ఇవ్వనున్నామన్నారు. సంగారెడ్డిజిల్లాలో నియంత్రిత వ్యవసాయ సాగువిధానంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పంటమార్పిడి సాగువైపునకు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎరువులను, పత్తివిత్తనాలను రైతులకు సకాలంలో అందించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 116రైతు బంధు వేధికల భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలన్నారు.

Recommended For You