ఆత్మహత్య చేసుకున్న అభినయ్.. అందుకే మూడు పేర్లు

సినీనటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ చెంగల్ పట్టు జిల్లా తిరుక్కలికుండ్రంలోని ఫామ్‌హౌస్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. అభినయ్ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. డాక్టర్ విద్యను పూర్తి చేసిన అభినయ్ బెంగళూరులోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ మధ్యే తిరుక్కలికుండ్రంలో ఓ బంగ్లాను ఆయన కొనుగోలు చేశారు. లాక్డౌన్‌ ఉన్నందున ఎటూవెళ్లలేని పరిస్థితి. దాంతో ఫామ్‌హౌస్‌లోని ఉండిపోయారు. మానసిక ఒత్తిడికి గురయ్యుంటారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

వాణీశ్రీకి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. అయితే ఆమెకు ముగ్గురు కొడుకులను కనాలని ఉండేదట. కానీ అనారోగ్య సమస్యల కారణంగా ఒక్కడితోనే సరిపెట్టుకున్నానని ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే తన కొడుక్కి మూడు పేర్లు ఉండేలా అభినయ వెంకటేశ కార్తీక్ అని పెట్టుకున్నానని చెప్పారు. ఇక కూతురు అనుపమ కూడా వైద్యురాలే కావడం విశేషం. డాక్టర్ చదివిన అమ్మాయినే కోడలిగా తెచ్చుకుని కొడుకు అభినయ్‌కి పెళ్లి చేశారు. కానీ అభినయ్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఆత్మహత్య చేసుకుని అమ్మకి కడుపు కోత మిగిల్చాడు.

Recommended For You