ఆధునికీకరణ పేరుతో చారిత్రక కట్టడం నేలమట్టం

ఆధునికీకరణ పేరుతో చారిత్రక కట్టడం నేలమట్టం చేశారు. విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభం కూల్చేసిన అధికారులు.. జాతీయ చిహ్నమైన మూడు సింహాలను రోడ్డున పడేశారు. రాజులకాలంలో విజయనగరం పట్టణంలో మూడు ప్రధాన రహదారులు కలిసే చోట చారిత్రక 3 లాంతర్ల స్తంభం నిర్మించారు. దీనిపై జాతీయ చిహ్నమైన 3 సింహాలు కొలువైనట్లు తీర్చిదిద్దారు.

రాత్రి సమయంలో ప్రయాణికులకు దారి కనిపించేలా అప్పట్లో ఈ నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత ఈ ప్రాంతం 3 లాంతర్ల జంక్షన్‌గా ప్రసిద్ధి చెందింది. ఆధునికీకరణ పేరుతో చారిత్రక కట్టడాన్ని కూల్చివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ చిహ్నమైన మూడు సింహాలను రోడ్డుపై పడేసి అవమానించారంటూ ఆవేదన చెందుతున్నారు. చారిత్రిక ప్రాముఖ్యత ఉన్న కట్టడాన్ని కూల్చివేసి.. దాని స్థానంలో మళ్లీ కొత్తది నిర్మించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Recommended For You