ఐసీఎంఆర్‌కు విరుద్ధంగా డబ్ల్యూహెచ్ఓ సూచనలు

హైడ్రోక్సీ క్లోరోక్విన్ వాడకం గురించి ప్రపంచ ఆరోగ్యసంస్థ కీలక సూచనలు జారీ చేసింది. అయితే, ఇవి భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సూచనలకు పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం. కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న వైద్య సిబ్బంది కరోనా బారిన పడకుండా ఉండేందుకు హైడ్రోక్సీ క్లోరోక్విన్ వాడొచ్చని.. దీంతో కరోనా బారిన పడే అవకాశం తగ్గువగా ఉంటుందని అని ఐసీఎమ్ఆర్ తెలిపింది. అయతే, ఐసీఎమ్ఆర్ ప్రకటించిన 24గంటల్లోనే పూర్తి విరుద్ధంగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించి కరోనా సోకకుండా చేసే శక్తి హైడ్రోక్సీ క్లోరోక్విన్ కు లేదని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.

Recommended For You