ఇంట్లో ఉన్నా బీపీ షుగర్ ఒంట్లో ఉండేసరికి..

లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇంట్లో కాలు బయటపెట్టలేదు. వర్క్ ఫ్రం హోం పేరుతో ఇంటి నుంచే ఆఫీస్ పని చేస్తున్నాడు సనత్‌నగర్ పరిధిలోని అశోక్ కాలనీకి చెందిన 25 ఏళ్ల యువకుడు. అయినా అతడికి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. గత రెండు సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బీపీ, షుగర్ ఉండడంతో మందులు వాడుతున్నాడు. బయటకెళ్తే కరోనా ఎక్కడ అటాక్ చేస్తుందో అని ఏ చిన్న పనికీ బయటకు వెళ్లే సాహసం చేయలేదు. అయినా కరోనా ఎలా వచ్చిందో అర్ధం కాలేదు. అయితే ఆ యువకుని సోదరులు బయటకు వెళ్లి వచ్చిన సందర్భంలో వారి నుంచి వైరస్ వచ్చిందేమో అని వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి కుటుంబసభ్యులందరికీ మెడికల్ టెస్టులు చేస్తున్నారు. దీంతో వారందరినీ ఇంట్లోనే హోంక్వారంటైన్‌లో ఉంచారు. కాగా, పాజిటివ్ వచ్చిన యువకుడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Recommended For You