దేశ రాజధానిలో కొత్తగా 591 కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనలు పగడ్భందీగా అమలు చేస్తున్నారు. అయినా.. కొత్తగా నమోదవుతున్నకేసుల సంఖ్య మాత్రం తగ్గటంలేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 591 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,910కు చేరుకున్నాయని ప్రభుత్వం తెలిపింది. శనివారం 370 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6267కి చేరగా.. 6412 మంది చికిత్స పొందుతున్నారు. అటు, ఇప్పటివరకూ 231 మంది కరోనాతో మృతి చెందారు.

Recommended For You