ఢిల్లీలో కరోనా కాటుకి ఒక్కరోజే 30 మంది బలి.. కొత్తగా వచ్చిన కేసులు..

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా భయంకరంగా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 508 కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 13,418కి చేరుకున్నాయి. అటు, ఒక్కరోజులో కరోనా మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 30 మంది కరోనా మహమ్మారికి బలైయ్యారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 261 మంది మరణించారు. అయితే.. 6,540 మంది ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా, 6,617 మంది చికిత్స పొందుతున్నారు.

Recommended For You