సిక్కిం ప్రత్యేక దేశంగా చూపడానికి కారణమైన అధికారి సస్పెండ్

సిక్కిం వేరే దేశంగా.. ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఉండటంతో సంచలనం రేగింది. దీంతో దానికి కారణమైన అధికారిని సస్పెండ్ చేస్తూ ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ అనీల్ బాయ్‌బల్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం సివిల్ డిఫెన్స్ విభాగంలో వాలంటీర్లుగా చేరాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని ఓ నోటిఫికేషన్ విడుదల చేయగా.. అందులో అర్హతల్లో.. భారత్ తో పాటు భూటాన్, నేపాల్, సిక్కిం దేశీయులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చని ఈ ప్రకటనలో ఉంది. ఇలా సిక్కీంను ప్రత్యేక దేశంగా పేర్కొనడంతో కేజ్రీవాల్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు చేశాయి. దేశ సార్వభౌమాదికారానికి భంగం వాటిళ్లేలా ఢిల్లీ ప్రభుత్వ ప్రకటన ఉందని.. దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని బీజేపీ మండిపడింది. మరోవైపు సిక్కీం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ కూడా దీనిపై స్పందించారు. సిక్కీం ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని.. వెంటనే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని కేజ్రీవాల్ ను కోరారు. దీంతో ఆ ప్రకటనను సవరించి.. దానికి కారకులైన అధికారిని సస్పెండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com