భారత్‌లో కరోనా వ్యాప్తి పెరగలేదు.. భారీగా తగ్గింది.. లెక్కలతో సహా వచ్చిన నివేదిక

భారత్‌లో కరోనా వ్యాప్తి పెరగలేదు.. భారీగా తగ్గింది.. లెక్కలతో సహా వచ్చిన నివేదిక

భారత్‌లో కరోనా ఉదృతి రోజు రోజుకు పెరుగుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులు సంఖ్య ప్రతీరోజు పెరుగుతూపోతుంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని మిచిగన్ యూనివర్సిటీ భారత్ లో కరోనా ప్రభావంపై చేసిన అద్యాయనం ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. భారత్ లో కేసులు పెరుగుతున్నప్పటికీ.. లాక్‌డౌన్ వలన ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో చాలా వరకు సఫలమయ్యారని అన్నారు. లాక్‌డౌన్‌తో 60శాతం వరకూ కరోనా వ్యాప్తి తగ్గిందని తేల్చింది. కరోనా వ్యాప్తి వేగాన్ని కనిపెట్టడానికి ఆర్ నాట్(R0) అనే ఒక ముఖ్యమైన ప్రాతిపదిక ఆధారంగా పరిశోధన చేస్తారు. ఈ ఆర్ నాట్(R0) అనేది ఒక వ్యక్తి నుండి కరోనా ఎంత మందికి సోకింది అనే ఒక సంఖ్యను సూచిస్తుంది. లాక్‌డౌన్ విధించే నాటికి అంటే.. మే24 నాటికి ఈ విలువ 3.36గా ఉంది. అయితే.. తరువాత అది తగ్గుతూ ఏప్రిల్ 14 నాటికి 1.71గా.. మే 3 నాటికి ఇది 1.46కి.. చివరికి మే16 నాటికి బారీగా తగ్గి 1.27కు చేరుకుందని ఈ అధ్యాయంలో తేలింది. అంటే.. లాక్‌డౌన్ విధించే నాటికి సగటున ఒకరి నుంచి 3.36 మందికి కరోనా సోకగా.. లాక్‌డౌన్ 3.0 నాటికి ఒకరి నుంచి 1.27 మందికి మాత్రమే సోకిందని.. భారీగా కరోనా వ్యాప్తి తగ్గిందని తేలింది.

Tags

Read MoreRead Less
Next Story