యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి

యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బీభత్సం కొనసాగుతోంది. వైరస్ బారిన పడి ప్రతినిత్యం వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ సోకి ఇప్పటివరకు 3లక్షల 40వేలమంది మరణించారు. గత 24 గంటల్లో 30వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 53లక్షల 28వేలు దాటాయి. ఇక 21లక్షల 75వేల మంది వైరస్ బారినుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అగ్రదేశం అమెరికా, బ్రిటన్, రష్యా, బ్రెజిల్ దేశాల్లో కోవిడ్ తీవ్రత ప్రమాదకరంగా కొనసాగుతోంది.

అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. దేశంలో మృతుల సంఖ్య 97వేలు దాటింది. కేసులు సంఖ్య 16లక్షల 45వేలకు చేరుకుంది. ఇప్పటివరకు 4లక్షల మంది వైరస్ బారినుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రష్యాలోను వైరస్ తీవ్రత అలానే కొనసాగుతోంది. దేశంలో కొత్తగా 9వేల కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 35వేలకు చేరుకుంది. ఇక మృతుల సంఖ్య 3వేలు దాటాయి. లక్షా 7వేలమంది వైరస్ బారినుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

బ్రెజిల్లో కోవిడ్ 19 ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటివరకు వైరస్ బారినపడి 21 వేలమంది మృత్యువాత పడ్డారు. మొత్తం కేసులు సంఖ్య 3లక్షల 32వేలు దాటాయి. ఒక లక్షా 35 వేలమంది కరోనానుంచి కోలుకున్నారు. స్పెయిన్ లోను వైరస్ ప్రభావం కొనసాగుతోంది. దేశంలో 28 వేల మందికిపైగా మరణించారు. మొత్తం కేసులు 2లక్షల81 వేలకుపైగా నమోదయ్యాయి. 1లక్షా 96వేలమంది వైరస్ నుంచి కోలుకున్నారు. యూకేలోను వైరస్ తీవ్రత అలాగే ఉంది. ఇప్పటివరకు కరోనాతో 36వేలమంది మరణించారు. దేశంలో 2లక్షల 54వేల కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story