ఏపీలో కొత్తగా 44 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 44 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2671కి చేరింది. వీటిలో చిత్తూరు జిల్లాలో 5 కేసులు ఉండగా, నెల్లూరు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,240 మందికి టెస్టులు చేశారు. కాగా 41 మంది వైరస్ బారిన పడి కోలుకోగా, 767 మంది చికిత్స పొందుతున్నారు.

Recommended For You