ఆలయాల భూమి గజం కూడా అమ్మడానికి వీల్లేదు: కన్నా

టీటీడీ ఆస్తులు విక్రయించాలన్న నిర్ణయంపై విపక్షాలు కన్నెర్ర చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ పోరుబాటకు సిద్ధమవుతోంది. ఆలయాల భూములు విక్రయిస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. భక్తులు కానుకగా ఇచ్చిన భూములను కాపాడటం చేతకావడం లేదా అని ఆయన ప్రశ్నించారు. నిరర్దక ఆస్తుల పేరుతో భూములు విక్రయించడం దారుణమన్నారు. ఆలయాల భూమి గజం కూడా అమ్మడానికి వీల్లేదన్నారు కన్నా లక్ష్మీనారాయణ. దేవాలయాల భూములు పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

Recommended For You