మే31 తరువాత కూడా లాక్‌డౌన్ కొనసాగించవచ్చు: ఉద్ధవ్ ఠాక్రే

మే31 తరువాత కూడా లాక్‌డౌన్ కొనసాగే అవకాశం లేకపోలేదని మహారాష్ట ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కావడం లేదని.. రోజురోజు పరిస్థితి మరింత తీవ్రమవుతోందిని అన్నారు. రానున్న కాలం చాలా ప్రమాదకరమని.. వర్షా కాలం కావడంతో వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉంటుందని అన్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉందని.. రానున్న కాలంలో కరోనాను ఏవిధంగా ఎదుర్కోవాలో ఆలోచిస్తున్నామని అన్నారు. దేశీయ విమానాలు ప్రారంభమవుతున్న సమయంలో.. మహారాష్ట్రలో మాత్రం విమాన రాకపోకలకు మరింత సమయం కావాలని అన్నారు.

Recommended For You