రోడ్డు మధ్యలో ముళ్లపంది.. స్పీడుగా దూసుకొస్తున్న వాహనాలు.. ఇంతలో కాకి ఏం చేసిందంటే?

ఓ చిన్న ముళ్లపంది నడి రోడ్డు మీద ఉండిపోయింది. రోడ్డు దాటలేని పరిస్థితిలో ఆ మినీ ముళ్లపంది ఉంది. అసలే ఆ రోడ్డులో వాహనాలు ఎక్కువగా తిరిగుతూ ఉంటాయి. డ్రైవర్లు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ముళ్లపంది మరణించే అవకాశం ఉంది. ఇంతలో అటు నుంచి స్పీడుగా ఓ వాహనం దూసుకొస్తోంది. పాపం ఆ ముళ్లపందికి ఏం చేయాలో తెలియక.. అయోమయంలో పడింది. ఇంతలో రోడ్డు దాటలేక ముళ్లపంది పడుతున్న అవస్థను ఓ కాకి గమనించింది. వెంటనే ఆ కాకి ముళ్ల పంది వద్దకు వచ్చి ముక్కుతో వెనుకవైపు పొడవడం మొదలుపెట్టింది. దీంతో ఆ జీవి కొంచెం ముందుకు కదిలింది. ఇలా ముళ్లపందిని చివరి వరకు రోడ్డు క్రాస్‌ చేయించింది కాకీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కాకిపై ప్రశంసలు కురిపిస్తూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Recommended For You