టీటీడీ ఆస్తులు వేలం వేయడానికి పూర్తి నిర్ణయం తీసుకోలేదు : వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ ఆస్తులు వేలం వేయడానికి పూర్తి నిర్ణయం తీసుకోలేదు : వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు వేలం వేయడానికి పూర్తి నిర్ణయం తీసుకోలేదన్నారు టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. ఫిబ్రవరి 20న జరిగిన బోర్డు మీటింగ్‌లో.. గత బోర్డు నిర్ణయాలను సమీక్షించినట్లు తెలిపారు. 50 నిరర్ధక ఆస్తులు విక్రయించేందుకు 2016లో టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని.. ఐతే.. టీటీడీ నిరర్ధక ఆస్తులపై రోడ్‌ మ్యాప్‌ కోసమే కమిటీ వేసినట్లు చెప్పారు. ఆస్తులు అమ్మాలో.. పరిరక్షించుకోవాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. భూములు వేలం వేయాలని ఆర్డర్ ఇవ్వలేదన్న వైవీ.. కమిటీ రిపోర్ట్ వచ్చాక వచ్చే బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

అటు.. ధార్మిక పెద్దల్ని, నిపుణుల్ని సంప్రదిస్తున్నామని.. ఆస్తులు అన్యాక్రాంతం కావొద్దనేదే తమ ఉద్దేశమన్నారు వైవీ సుబ్బారెడ్డి. తాము దేవుడి సొమ్ము ఆశించేవాళ్లం కాదన్న వైవీ.. టీటీడీ నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తున్నట్లు చెప్పారు. ఐనా.. 1974 నుంచి 2014 వరకు 129 ఆస్తులు అమ్మకం జరిగిందని.. ఇదేం కొత్త విషయం కాదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story