42 మంది పార్టీ చేసుకున్నారు.. 22 మందికి కరోనా సోకి ఆస్పత్రిలో..

42 మంది పార్టీ చేసుకున్నారు.. 22 మందికి కరోనా సోకి ఆస్పత్రిలో..

కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే సోషల్ డిస్టెన్స్ తప్పనిసరని సామాజిక మాధ్యమాల్లో మొత్తుకుంటున్నా వినేవారేరి.. మందు పార్టీలు చేసుకుంటూ మస్తు మజా చేస్తున్నారు. పది రోజుల కిందట నాలుగు కుటుంబాలకు చెందిన 28 మంది వేడుక చేసుకోవాలనుకున్నారు. బంధువులను కూడా పిలిచారు. మొత్తం 42 మంది కలిసి రెండు రోజులు ఎంజాయ్ చేశారు.

పహాడీషరీఫ్‌లో నివసిస్తున్న మటన్ వ్యాపారి ఇంట వేడుకకు జియాగూడ, గౌలిపురా, బోరబండ, సంతోష్ నగర్ ప్రాంతాల నుంచి మొత్తం 14 మంది పార్టీకి వచ్చారు. అక్కడ పార్టీ పూర్తయిన తరువాత అందులో కొందరు హర్షగూడలో కిరాణా దుకాణం నడిపే బంధువు ఇంటికి వెళ్లారు. అక్కడ మళ్లీ వారితో కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీ పూర్తయిన పది రోజులకి అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి వెళితే పరీక్షల్లో కోవిడ్ నిర్థారణ అయింది.

పహాడీషరీఫ్‌లోని 13 మందికి, కిరాణా వ్యాపారి కుటుంబానికి చెందిన నలుగురికి, బోరబండ నుంచి వచ్చిన ముగ్గురికి, సంతోష్ నగర్ నుంచి వచ్చిన అయిదుగురికి పాజిటివ్ వచ్చింది. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారినందరినీ బుధవారం నుంచి ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తారని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాల నరేంద్ర తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story