మహారాష్ట్రలో ఒక్కరోజులో 97 మరణాలు

మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. గడిచిన 24 గంటల్లో 2,091 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54,758కి చేరిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, అటు.. గడిచిన 24 గంటల్లో 97 మంది మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క రాష్ట్రంలో ఒకే రోజులో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఒక్క రాష్ట్రాన్నే కాదు.. యావత్ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తుంది.

Recommended For You