నిరుపేద గల్ఫ్ కార్మికులకు ఉచిత క్వారంటైన్

నిరుపేద గల్ఫ్ కార్మికులకు ఉచిత క్వారంటైన్

గల్ఫ్ దేశాల నుంచి వచ్చే కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా సమాచార విభాగం ఏర్పాటు చేసింది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారు ఇమ్మిగ్రేషన్ చెక్ అయిపోయాక పెయిడ్ క్వారంటైన్ కు వెళ్ళలేని వారు ఉంటే ఇక్కడ కౌంటర్ లో చెబితే బస్సు లో గవర్నమెంట్ క్వారంటైన్ కు పంపుతారు. వారం రోజులకు భోజనం, వసతికి కలిపి ప్రీమియం కేటగిరికి 16 వేలు, స్టాండర్డ్ కేటగిరి కి 8వేలు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నిరుపేద గల్ఫ్ కార్మికులు డబ్బులు చెల్లించలేని వారికోసం ప్రభుత్వం ఉచిత క్వారంటైన్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత క్వారంటైన్ సెంటర్లలో వారికి భోజనం మరియు వసతి ఉచితంగా అందిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story