శ్రీవారి ఆస్తులపై.. రమణ దీక్షితులు సంచలన ట్వీట్

శ్రీవారి ఆస్తులపై తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలేశుడి ఆస్తులు, ఆభరణాలపై పూర్తి ఆడిట్ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వం నాటి నుంచి ఇప్పటివరకు టీటీడీ ఆదాయం, ఖర్చులు, ఆస్తులు, ఆభరణాలపై జాతీయ స్థాయిలో స్పష్టమైన ఆడిట్ జరగాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామికి ట్వీట్ చేశారు రమణ దీక్షితులు. శ్రీవారి ఆస్తులు అమ్మాలని టీటీడీ తీసుకున్న నిర్ణయం వివాదస్పదం అయిన నేపథ్యంలో రమణ దీక్షితులు చేసిన ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.

Recommended For You