తెలంగాణలో ఒకే రోజు రికార్డుస్థాయిలో 107 కరోనా కేసులు

తెలంగాణలో ఒకే రోజు రికార్డుస్థాయిలో 107 కరోనా కేసులు

తెలంగాణలో తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఒకే రోజు రికార్డుస్థాయిలో 107 కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. వీటిలో తెలంగాణ నుంచి 39 కేసులు నమోదు కాగా.. 19 వలస కార్మికులతో పాటు.. సౌదీ నుంచి వచ్చిన 49 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. 107 కేసులలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 76 కేసులు నమోదు కాగా.. వేరే జిల్లాల్లో కూడా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇక కరోనా బారిన పడి ఆరుగురు మృతిచెందగా.. మృతుల సంఖ్య 63కు చేరింది.

కొత్త కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2098కి చేరింది. కొత్తగా 37 మంది డిశ్చార్జి కాగా.. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1321కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 714 యాక్టివ్ కేసులున్నాయి. ఇక, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరో 20 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులు నిర్ధారణ కాలేదు.

లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి ఎక్కువమంది వస్తున్నారు. వీరిలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. వాటిని వేరుగా చూపించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీని ప్రకారం తెలంగాణలో కేసుల సంఖ్య 1842కు చేరగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 297 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story