కేంద్రం మౌనం వీడాలి: రాహుల్ గాంధీ

కేంద్రం మౌనం వీడాలి: రాహుల్ గాంధీ

చైనాతో వివాదం విషయంలో కేంద్రం మౌనం వీడాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. సరిహద్దుల్లో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. ఇలాంటి కీలక సమయంలో కేంద్రం ఎందుకు మౌనం అని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా వాస్తవాదీన రేఖ వెంట చైనా కవ్వింపు చర్యలకు దిగుతుంది. చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకు వస్తున్నారు. దీంతో ఇరుదేశాల సైన్యం అలెర్ట్ అవుతోంది. ఈ నేపథ్యంలో చైనా, భారత్ మధ్య వివాదాన్ని.. ఇరుదేశాల అంగీకారంతో నేను పరిస్కరిస్తానని ట్రంప్ ప్రకటించారు. అయితే, అటు చైనా, ఇటు భారత్ రెండూ ట్రంప్ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించాయి. ద్వైపాక్షిక సంబంధాల ద్వారా సమస్యను పరిస్కరించుకుంటామని ఇరుదేశాలు ప్రటించాయి. ఈ నేపథ్యంలో రాహుల్ చైనాతో వివాదంపై కేంద్రం స్పందించాలని ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story