ప్రత్యేకహోదా విషయంలో జగన్ మాట తప్పారు: కాంగ్రెస్

ప్రత్యేకహోదా విషయంలో జగన్ మాట తప్పారు: కాంగ్రెస్
X

వైసీపీ ఏడాది పాలనపై.. 'మీ పాలన.. మా సూచన' పేరుతో.. సీఎం జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధర్. ప్రత్యేక హోదాపై సీఎం మాట తప్పారని అన్నారు. అమ్మ ఒడి పథకానికి అసలు నిధులే లేవని అన్నారు. జగనన్న విద్యాదీవెన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకమేనని చెప్పారు. జగనన్న వసతి దీవెన కూడా పాతదానికి కొత్త పేరు పెట్టిన పథకమేనని అన్నారు. ఎన్నికల ముందు రాజధాని మార్పు అని ఎక్కడా చెప్పని జగన్.. అస్పష్ట ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

Tags

Next Story