రాజస్థాన్‌లో మరోసారి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

రాజస్థాన్‌లో శనివారం ఉదయం 49 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కోటా, ఉదయపూర్ మరియు చురులో ఎనిమిదేసి కేసులుండగా , బార్మెర్‌లో 4, ధోల్‌పూర్ 3, హలలావార్ 3, భిల్వారా 3, కరౌలిలో 3, భరత్‌పూర్ , జైపూర్‌లలో 2 , గంగానగర్, బరాన్ మరియు హనుమన్‌గర్ లో 1 కేసు నమోదయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8414 కు చేరింది. జైపూర్‌లో ఈ రోజు ఒకరు ఇన్‌ఫెక్షన్‌తో మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 185 కి పెరిగింది.

ఇదిలావుంటే రాజస్థాన్ బోర్డు 10వ 12 వ పరీక్షలు జూన్లో జరుగుతాయని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం అర్థరాత్రి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం త్వరలో పరీక్ష సమయ పట్టిక విడుదల అవుతుందని ఆయన అన్నారు. ఇక మే 31 తర్వాత కూడా రాష్ట్రమంతా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు. అయితే అత్యవసర పనులకు మాత్రమే అనుమతిచ్చారు.

Recommended For You