డాక్టర్ సుధాకర్ కు ఏమైనా జరిగితే.. దళిత సంఘాలు హెచ్చరిక

డాక్టర్ సుధాకర్ కు ఏమైనా జరిగితే.. దళిత సంఘాలు హెచ్చరిక

విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా టీడీపీ ఎస్సీ సెల్‌, దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మేధావి అయిన సుధాకర్‌పై ప్రభుత్వం కక్ష కట్టిందని వారు ఫైరయ్యారు. డాక్టర్‌ సుధాకర్‌కు ఏమైనా జరిగితే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని దళిత సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. సుధాకర్‌కు జరుగుతున్న వైద్యానికి సంబంధించి ప్రభుత్వం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సుధాకర్‌ అంశంపై త్వరలో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story