హెచ్‌సీ‌క్యూ విషయంలో డబ్ల్యూహెచ్‌ఓను వ్యతిరేకించిన ఐసీఎంఆర్

భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) హైడ్రాక్సీక్లోరోక్విన్ ప్రపంచ ఆరోగ్యసంస్థ అభిప్రాయన్ని వ్యతిరేకిస్తూ మెయిల్ చేసింది. కరోనా రోగులకు ఈ ఔషధాన్ని వినియోగించ వచ్చు అనే దానికే తాము కట్టుబడి ఉన్నామని ఈ మెయిల్ ద్వారా తెలిపింది. ఈ ఔషధం ప్రభావశీలత ఎంతో తెలుసుకునేందుకు జరుగుతున్న అధ్యయనాన్ని డబ్ల్యూహెచ్‌ఓ నిలిపివేయడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ లో తీసుకునే డోసులకు, ఇతర దేశాల్లో తీసుకునే డోసులకు తేడా ఉండటం వలన మందు ప్రభావశీలతలో తేడా కనిపిస్తుందని తెలిపింది. భారత్ లో కరోనా రోగులుకు హెచ్‌సీ‌క్యూ వినియోగిస్తామని స్పష్టం చేసింది.

Recommended For You