త్వరలో పేదలకు ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు

త్వరలో పేదలకు ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు

పేదలకు ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ (కె-ఫోన్) ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రారంభిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.రూ.1,500 కోట్ల కె-ఫోన్ ప్రాజెక్టు కోసం ఏర్పాటైన కన్సార్టియం కంపెనీల అధిపతులతో జరిగిన సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ నిర్ణయాన్ని తెలియజేశారు.

ఇంటర్నెట్‌ను పౌరుడి ప్రాథమిక హక్కుగా ప్రకటించిన మొదటి రాష్ట్రం కేరళ. ఇందులో భాగంగా, పేదలకు ఉచితంగా మరియు ఇతరులకు సరసమైన ధరలకు నాణ్యమైన ఇంటర్నెట్‌ను అందించడానికి K-FON ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.

ఈ తరహా ప్రాజెక్టును ఏ రాష్ట్రం అమలు చేయలేదు. లాక్డౌన్ కారణంగా ఆలస్యం జరిగినప్పటికీ, ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు విజయన్ చెప్పారు.

ఈ కన్సార్టియంలో ప్రభుత్వ రంగ సంస్థలు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) , రైల్టెల్ , ఎస్ఆర్ఐటి , ఎల్ఎస్ కేబుల్స్ వంటి ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కేరళ స్టేట్ ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తోంది.

కెఎస్‌ఇబి పోస్టులను ఉపయోగించి రాష్ట్రవ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేశారు. K-FON నెట్‌వర్క్.. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు , ఇతర సంస్థలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అంతేకాకుండా, ఇది "రాష్ట్రం విజన్-ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story