కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 30 వరకూ లాక్ డౌన్ కొనసాగింపు

ఐదవ దశ లాక్డౌన్ జూన్ 1నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 30 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని వెల్లడించింది. మార్గదర్శకాలు జూన్ నుండి అమల్లోకి వస్తాయని.. జూన్ 30 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది.

సవరించిన షెడ్యూల్‌తో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని.. దీనిద్వారా వ్యక్తుల యొక్క కదలికను గమనిస్తుందని పేర్కొంది. రాత్రి 9 గంటలనుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ విధించారు. అలాగే రాజకీయ, సామాజిక, మతపరమైన కార్యకలాపాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. జూన్ 8 నుంచి ప్రార్ధనా కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది.

Recommended For You