ఐపీఎల్ విదేశాల్లో జరగనుందా..!!

ఐపీఎల్ విదేశాల్లో జరగనుందా..!!

ఈ ఏడాది మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ కరోనా కారణంగా తాత్కాలికంగా రదైంది. అయితే మ్యాచ్‌ను ఎప్పుడు నిర్వహించాలనేదానిపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. అవసరమైతే విదేశంలో అయినా ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ వ్యూహం రచిస్తోందని అధికారి ఒకరు వెల్లడించారు. బోర్డు ప్రతి అంశాన్నీ పరిశీలిస్తోంది. విదేశాల్లో నిర్వహించాల్సి వచ్చినా అదీ చేస్తాం. ఇదేమీ మొదటి సారి తీసుకుంటున్న నిర్ణయం కాదు.

ఇంతకు ముందు కూడా 2009లో దక్షిణాఫ్రికాలో జరిగితే, 2014 యూఏఈలో జరిగింది. కానీ, భారత్‌లో నిర్వహించడానికే తొలి ప్రాధాన్యత ఇస్తామంటున్నారు బీసీసీఐ ప్రతినిధులు. ఏ విషయమూ టీ-20 ప్రపంచకప్ గురించిన స్పష్టత వచ్చాకే ఐపీఎల్ గురించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సర్లే.. ఎక్కడో ఒక చోట జరుగుతుంది. ఐపీఎల్ జరగడమే కదా కావాల్సింది. ఎక్కడ జరిగినా వెళ్లి చూడ్డానికైతే కుదరదు. కనీసం టీవీల్లో అయినా చూడొచ్చు గేమ్ అంటూ జరిగితే.. అని క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story